విద్యార్థులకు అభినందన సీఎం ఆలంబన
సూర్య తేజశ్రీ..సత్తా ప్రదీప్తికి ఆర్థిక సాయం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిభ ఎక్కడ ఉన్నా , ఏ మూలన ఉన్నా దానిని గుర్తిస్తారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. ఆయన నైజమే అంత. నిరంతరం అభివృద్ది నమూనా, టెక్నాలజీ వినియోగంపై ఎక్కువగా దృష్టి సారిస్తారు .
చంద్రబాబు నాయుడు సీఎంగా కొలువు తీరిన వెంటనే విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అంతే కాకుండా ఐటీని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా తాజాగా విద్యా పరంగా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా విదేశాలలో యూనివర్శిటీలలో చదివేందుకు ఎంపికైన ఏపీకి చెందిన విద్యార్థినులు సూర్య తేజశ్రీ, సత్తా ప్రదీప్తిలను వెన్ను తట్టి ప్రోత్సహించారు.
వీరి గురించి తెలుసుకున్న సీఎం వెంటనే సంబంధిత ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆదేశించారు తన వద్దకు తీసుకు రమ్మని.
పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను అభినందించారు. వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు చెరో ల్యాప్ టాప్ ను అందజేశారు. ఈ సందర్బంగా ఏపీకి మరింత పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు నారా చంద్రబాబు నాయుడు.