NEWSANDHRA PRADESH

తెలంగాణ సీఎం ఫ్యూచ‌ర్ సిటీ జ‌పం

Share it with your family & friends

రాబోయే రోజుల్లో ప్ర‌పంచంతో పోటీ

హైద‌రాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే ఫ్యూచ‌ర్ సిటీ అనే ప‌దాన్ని చెబుతూ వ‌స్తున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ముందుగా ఫ్యూచ‌ర్ సిటీ గురించి ప్ర‌స్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ‌కు త‌ల మానికం కాబోతోందంటూ చెబుతున్నారు. అంతే కాదు తెలంగాణ అంటే గ‌తంలో హైద‌రాబాద్ అని చెప్పే వార‌ని, కానీ తాను వ‌చ్చాక దానిని మార్చేసి..ఫ్యూచ‌ర్ సిటీని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ముచ్చ‌ర్ల వేదిక‌గా ఫ్యూచ‌ర్ సిటీని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి. ఇటీవ‌లే సీఎం అమెరికా, ద‌క్షిణ కొరియా దేశాల‌లో ప‌ర్య‌టించారు. రూ. 31,500 కోట్ల పెట్ట‌బ‌డులు తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

30 వేల మందికి ఇప్ప‌టికే నియామ‌క ప‌త్రాలు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఫ్యూచ‌ర్ సిటీకి సంబంధించి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా.. హైదరాబాద్‌ అభివృద్ధిపై మాత్రం అభిప్రాయ భేదాలు లేవ‌న్నారు సీఎం.

ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో ఫోర్త్‌ సిటీని నిర్మించ బోతున్నామ‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఒప్పందాలు కుదరనున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు .