NEWSNATIONAL

యూనిఫాం సివిల్ కోడ్ అమ‌లు చేస్తాం

Share it with your family & friends

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌ట‌న

ఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 78వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేశారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

యూనిఫాం సివిల్ కోడ్ ను అమ‌లు చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు పీఎం. గ‌త 78 సంవ‌త్స‌రాలుగా దేశంలో మ‌త ప‌ర‌మైన సివిల్ కోడ్ తో గ‌డిపామ‌ని, ఇక ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు మోడీ.

బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు పెర‌గ‌డాన్ని ప్ర‌స్తావించారు. దీనిని తాము ఖండిస్తున్నామ‌ని , ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

విదేశాల నుంచి సవాళ్లు పెరుగుతున్నాయ‌ని , ఈ అంశాల ముందు తాను త‌ల వంచ‌నని ప్ర‌క‌టించారు ప్ర‌ధాన‌మంత్రి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్బంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌క‌టించిన మేని ఫెస్టోలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామ‌ని హామీ ఇచ్చామ‌న్నారు. దానిని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మోడీ.