ఎవరికీ తలవంచం దాడులు చేస్తే సహించం
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రధాని హెచ్చరిక
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత గురించి 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. భారత దేశం శాంతిని కోరుకుంటుందని, కానీ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదని అన్నారు. ఒకవేళ ఇలాగే పనిగట్టుకుని హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ప్రధానమంత్రి. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
భారతదేశం ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ పురోగతికి శ్రేయోభిలాషిగా ఉంటుంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని తాము ఆశిస్తున్నాము. భారతీయులు హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు పీఎం.
తాము దాడులకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంటుందని తాము నమ్ముతామని చెప్పారు మోడీ. ఇకనుంచి దాడులకు స్వస్తి పలకాలని, హిందువులకు, మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరారు పీఎం.