SPORTS

రాబోయే ఒలింపిక్ గేమ్స్ కు భార‌త్ సిద్దం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి మోడీ

ఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవిత కాలంలో ఒలింపిక్ గేమ్స్ కు భార‌త దేశం ఆతిథ్యం ఇవ్వాల‌ని ఉంద‌న్నారు. ఈ క‌ల‌ను నిజం కావాల‌ని మ‌నమంతా కోరుకుందామ‌ని చెప్పారు.

78వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎర్ర‌కోట పై జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేశారు మోడీ. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. 143 కోట్ల మంది భార‌తీయులు ముక్త కంఠంతో భార‌త్ ఒలింపిక్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

దీనికి తాము కూడా ప్ర‌య‌త్నం చేస్తామ‌ని అన్నారు మోడీ. ప్ర‌పంచంతో పోటీ ప‌డే స‌త్తా క‌లిగిన క్రీడాకారులు మ‌న వ‌ద్ద ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇందు కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తామ‌ని అన్నారు.

మ‌న క్రీడాకారులు భార‌త దేశ గౌర‌వాన్ని ఇనుమ‌డింప చేసేలా ప్ర‌తిభా పాట‌వాల‌ను పారిస్ వేదిక‌గా జ‌రిగిన ఒలింపిక్స్ లో ప్ర‌ద‌ర్శించార‌ని కొనియాడారు. కానీ కేవ‌లం 100 గ్రాముల బ‌రువు తేడాతో ప‌త‌కానికి దూరం కావ‌డం త‌న‌ను మ‌రింత బాధ‌కు గురి చేసింద‌న్నారు న‌రేంద్ర మోడీ. భ‌విష్య‌త్తులో భార‌త్ త‌న వంతుగా టాప్ లో ఉండేలా చూస్తుంద‌న్నారు.