దేశ వ్యతిరేక శక్తులకు మోడీ వార్నింగ్
అస్థిర పర్చాలని చూస్తే ఊరుకోం
ఢిల్లీ – సమున్నత భారత దేశం శాంతిని కోరుకుంటుంది. అలాగని దీనిని అలుసుగా తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు మోడీ. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన దేశ వ్యతిరేక శక్తులపై నిప్పులు చెరిగారు. రాజకీయాల పేరుతో కొందరు పనిగట్టుకుని భారత సమాజాన్ని నిర్వీర్యం చేసే , అస్థిర పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారిని ఎవరినీ వదిలి వేసే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ.
ప్రధానమంత్రి ప్రధానంగా టెర్రరిస్టులు, ఉగ్రమూకల దాడులు, హిందువలను టార్గెట్ చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక బలగం కలిగిన ఏకైక దేశం మనదని ఈ సందర్బంగా స్పష్టం చేశారు పీఎం.
పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్ లోకి చొరబాట్లను ప్రోత్సహించినా లేదా దాడులకు తెగబడితే అంతకు రెట్టింపు బదులు తీర్చుకుంటామని అన్నారు . దీంతో మోడీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.