NEWSANDHRA PRADESH

అమ‌రుల త్యాగ ఫ‌లం నేటి స్వ‌తంత్రం

Share it with your family & friends

డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఎంద‌రో బ‌లిదానాల‌, త్యాగాల ఫ‌లితంగానే నేటి స్వ‌తంత్రం సిద్దించింద‌ని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌. 78వ స్వ‌తంత్ర దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని గురువారం కాకినాడ పోలీస్ గ్రౌండ్ లో జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేశారు. అనంత‌రం పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌. అమరుల త్యాగాల ద్వారా వచ్చిన ఈ స్వేచ్ఛ‌ను ఓ పండుగ‌లా జరుపు కుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు.

అయితే, వేడుకలు జరుపుకుని ఆనందించడం సరి పోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది అని చెప్పుకొచ్చారు. మొట్ట మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. అలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర స‌మ‌ర‌ యోదులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.