జెండా ఎగుర వేతలో ప్రధాని రికార్డ్
ఎర్రకోటపై 11 సార్లు ఎగుర వేసిన మోడీ
ఢిల్లీ – భారత దేశ చరిత్రలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రి గా కొలువు తీరారు కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ప్రస్తుత ప్రధానమంత్రి దామోదర దాస్ నరేంద్ర మోడీ. ఆయన ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా 11 సార్లు భారత దేశ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.
గురువారం ఆగస్టు 15ను పురస్కరించుకుని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా హాజరై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇప్పటి వరకు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరుతో మీద ఉన్న రికార్డును మోడీ సమం చేశారు. ఇప్పటి వరకు దేశ ప్రధానమంత్రులలో ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగుర వేసిన వారిలో దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు.
నెహ్రూ జాతీయ జెండాను 17 సార్లు ఎగుర వేశారు. ఇందిరా గాంధీ 16 సార్లు ఎగుర వేశారు. అయితే కంటిన్యూగా 11 సార్లు ఎగుర వేయగా ఎమర్జెన్సీ విధించడంతో ఆమె తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత తిరిగి పీఎం అయ్యారు.
ఇక మోడీ 11 సార్లు ఎగుర వేయగా..కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 10 సార్లు జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇక రాబోయే 2029లో కూడా ప్రధానిగా మోడీ గెలిస్తే నెహ్రూ స్థానంలో అత్యధిక కాలం పాటు పీఎంగా పని చేసిన వ్యక్తిగా మోడీ రికార్డు సృష్టించనున్నారు.