అన్న క్యాంటీన్లు దేశానికే ఆదర్శం – సీఎం
పేదల ఆకలిని పట్టించుకోని జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పంధ్రాగస్టును పురస్కరించుకుని గుడివాడలో గురువారం అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తన భార్య నారా భువనేశ్వరి , ఎమ్మెల్యే రాము హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు స్వయంగా అన్నాన్ని వడ్డించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
తాము పేదలు, సామాన్యుల ఆకలిని తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక వాటిని నిర్వీర్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చడం నేరం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ సైకో జగన్ రెడ్డి కారణంగా లక్షలాది మంది ఆకలి కేకలతో అలమటించి పోయారని అన్నారు.
ఇవాళ అత్యంత రుచిరకంగా, నాణ్యవంతంగా అన్నా క్యాంటీన్లలో టిఫిన్లు, భోజనాలను వడ్డించడం జరుగుతుందన్నారు. కేవలం రూ. 5కే వీటిని అందజేస్తున్నట్లు చెప్పారు. చిన్నారుల నుంచి పండు ముదసలి వరకు, కుల, మతాలు, వర్గాలకు అతీతంగా ఎవరైనా అన్న క్యాంటీన్ల వద్దకు రావచ్చని అన్నారు.
అన్న క్యాంటీన్లను దేశంలోనే ఆదర్శ వంతంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.