రేవంత్ పని తక్కువ ప్రచారం ఎక్కువ
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సొల్లు కబుర్లు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు తానే కట్టినట్లు రిబ్బర్ కట్ చేసి ప్రచారం చేసుకుంటున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
తమకు క్రెడిట్ దక్కాలని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు . రైతులకు తాగు, సాగు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రాజెక్టును పూర్తి చేశారని అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆనాడు రిజర్వాయర్లు కట్టింది, పంపులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు కేటీఆర్. ప్రజలకు అన్నీ తెలుసు అని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అబద్దాలను వారు నమ్మడం లేదన్నారు. ఈ పీఆర్ స్టంట్లతో ఎక్కువ కాలం కన్ ఫ్యూజ్ చేయలేరని అన్నారు . ఇకనైనా వాస్తవాలు మాట్లాడితే బావుంటుందని సూచించారు.
ఇచ్చిన ఆరు హామీల కథేమిటో చెప్పాలన్నారు. తమ హయాంలో భర్తీ చేసిన వాటికి ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ముందు 2 లక్షల జాబ్స్ భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని సవాల్ విసిరారు కేటీఆర్.