కేటీఆర్ కామెంట్స్ సీతక్క సీరియస్
మహిళలంటే అంత చులకన ఎందుకు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్క. తను స్థాయి మరిచి, సోయి లేకుండా ఎలా పడితే అలా మహిళలను చులకన చేసి మాట్లాడడం పట్ల మండిపడ్డారు.
ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉప సహరించు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు కూడా ఓ భార్య, కూతురు ఉందన్న విషయం మరిచి పోయి మాట్లాడటం దారుణమన్నారు సీతక్క.
ఆర్టీసీ బస్సులలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయించే సంస్కృతీ మీకుందేమో కానీ తమకు లేదన్నారు మంత్రి. మహిళల పట్ల మీకున్న మర్యాద, గౌరవం ఇదేనా ? అని నిలదీశారు. చులకన చేసిన కేటీఆర్…మహిళలకు బేషరుతగా క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
పదేళ్లు హైదరాబాద్ లోని క్లబ్బుల్లో, పబ్బుల్లో బ్రేక్ డాన్సులను ప్రోత్సహించిన చరిత్ర మీది కాదా అని నిలదీశారు. ప్రయాణ సమయంలో మహిళలు ఏదో ఒక పని చేసుకుంటే తప్పేంటి అని మండిపడ్డారు. పేదలంటే మీకు గిట్టదని , అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.