మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేయండి
అనుచిత కామెంట్స్ చేసిన కేటీఆర్ పై ఫైర్
హైదరాబాద్ – ఆయన బాధ్యత కలిగిన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. పలు భాషలలో అనర్ఘలంగా మాట్లాడగలడు. వేలాది మంది సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీకి ఆయన దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందారు. చివరకు ప్రధానంగా ఈమధ్యన ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో కాదు కేటీఆర్.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారారు. సామాజిక మాధ్యమాలలో ట్రోల్ కు గురవుతున్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలన సాగించిన గులాబీ పార్టీకి జనం షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోంది. ఇది పక్కన పెడితే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది.
ప్రతి రోజూ మహిళలు లక్షలాది మంది తమ తమ గమ్య స్థానాలకు వెళుతున్నారు. అయితే కొందరు పాపులర్ కావాలనే ఉద్దేశంతో రీల్స్ కూడా చేసుకుంటున్నారు. కొందరు ఆకతాయిలు బస్సులలో ప్రయాణం చేస్తున్న మహిళలను, వారి చేష్టలను వీడియోల రూపంలో షేర్ చేస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల గురించి. బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ పేర్కొన్నారు. దీనిపై మహిళలు , మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.