మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
కేక్ కట్ చేసిన డైరెక్టర్..హీరోయిన్
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ , భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలై విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది.
మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పూర్తిగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు హరీశ్ శంకర్. గతంలో రవితేజతో సినిమా తీశాడు.
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇందులో కొత్తగా నటించింది. ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్సాన్స్ రావడంతో దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతతో కలిసి హీరోయిన్ సినిమా థియేటర్ లో కేక్ కట్ చేశారు.
ఈ మూవీలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించగా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్యం రాజేష్, ఝాన్సీ, తనికెళ్ళ భరణి, సత్య, నాగ మహేష్, చమ్మక్ చంద్ర ఇతర పాత్రలలో మెప్పించారు.
అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించగా ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేసారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ రైడ్ కి అధికారిక రీమేక్ గా తీశాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఎప్పటి లాగే ఆకట్టుకునేలా డైలాగులు రాశాడు.