అబద్దాలు చెప్పడంలో సీఎం నెంబర్ వన్
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అబద్దాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరి తేరాడని, దేశంలోనే నెంబర్ వన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము చేపట్టిన పనులను మీరే చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. మొన్న 30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చామని, నిన్న కాగ్నిజెంట్ కంపెనీని కూడా తెచ్చామని, ఇవాళ సీతారామ ప్రాజెక్టును తామే కట్టామని గొప్పలు చెప్పడం మీకే చెల్లిందని మండిపడ్డారు.
మా కష్టాన్ని ఎన్నిసార్లు మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హద్దు మీరిన అబద్దాలతో ఇంకా ఎన్ని సార్లు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సర్కారు క్రెడిట్ ను కొట్టేసే ప్రయత్నం మీరు ఎంత చేసినా నాలుగున్నర కోట్ల ప్రజలు మాత్రం సీఎం అబద్దాలను నమ్మరని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదని అన్నారు కేటీఆర్. ఇకనైనా సీఎం మారితే బెటర్ అని అన్నారు.