NEWSTELANGANA

ఎమ్మెల్సీలుగా కోదండ‌రాం..అమీర్ అలీఖాన్

Share it with your family & friends

ప్ర‌మాణ స్వీకారం చేసిన ప్రొఫెస‌ర్..ఎడిట‌ర్

హైద‌రాబాద్ – ఎట్ట‌కేల‌కు క‌ల నెర‌వేరింది ప్రొఫెస‌ర్ , ఎడిట‌ర్ కు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరిన వెంట‌నే తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన కోదండ‌రాం రెడ్డితో పాటు ప్ర‌ముఖ ఎడిట‌ర్ అమీర్ అలీఖాన్ కు లైన్ క్లియ‌ర్ అయ్యింది.

వీరి ఎంపిక‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ , స‌త్య నారాయ‌ణ‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు. వీరి ఎన్నిక చెల్ల‌దంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. వీరి ఎన్నిక చెల్ల‌దంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై స్టే విధించింది. దీంతో శుక్ర‌వారం ఈ ఇద్ద‌రికి ఖుష్ క‌బ‌ర్ చెప్పింది స‌ర్కార్. ప్రొఫెస‌ర్ కోదండ రాం రెడ్డి, అమీర్ అలీ ఖాన్ చేత శాస‌న మండ‌లి స‌భ్యులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి , పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కోదండ రాం రెడ్డితో పాటు అమీర్ అలీఖాన్ ల‌ను అభినందించారు.