గవర్నమెంట్ జాబ్ డోంట్ కేర్
హర్యానా సర్కార్ కు సింగ్ షాక్
హర్యానా – హర్యానా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. పారిస్ ఒలింపిక్ గేమ్స్ లో సత్తా చాటి, పతకం సాధించిన సరబ్జోత్ సింగ్ కు సీఎం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం తనకు అక్కర్లేదంటూ స్పష్టం చేశాడు సింగ్. దీంతో సీఎం విస్తు పోయారు తన నిర్ణయం తీసుకోవడం పట్ల.
ప్రభుత్వ ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపాడు . జాబ్ ఇస్తానని ప్రకటించినందుకు ధన్యవాదాలు. కానీ తాను ప్రస్తుతం ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదన్నాడు. సరబ్జోత్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. .
“నా కుటుంబం కూడా నాకు మంచి ఉద్యోగం కావాలని అడుగుతోంది, కానీ నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ప్రస్తుతం ఉద్యోగం చేయలేను”
సంచలన వ్యాఖ్యలు చేశాఉ పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సరబ్జోత్ సింగ్ . తన దృష్టి ప్రస్తుతం జాబ్ మీద లేదన్నాడు. ఇదిలా ఉండగా ఒలింపిక్ గేమ్స్ 2024లో మను భాకర్ తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ లో కాంస్య పతకం గెలిచాడు సరబ్జోత్ సింగ్. భారత దేశం తరపున గోల్డ్ మెడల్ సాధించాలన్నది తన టార్గెట్ అని పేర్కొన్నాడు .