ఫాక్స్ కాన్ చైర్మన్ తో సీఎం భేటీ
న్యూఢిల్లీలో కీలక సమావేశాలు
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ఏఐసీసీ హైకమాండ్ తో కలిసేందుకని వెళ్లారు. శుక్రవారం ప్రపంచంలో పేరు పొందిన ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి.
ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారిశ్రామిక పాలసీ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్శిటీ, తదితర అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తున్నామని చెప్పారు సీఎం.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి హై కమాండ్ తో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా వాటిని పూర్తి చేసి, పీసీసీ చీఫ్ ఎవరిని నియమించాలనే దానిపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించనున్నారు.