కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
కోఆపరేటివ్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి
హైదరాబాద్ – తెలంగాణ మహిళా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి నిప్పులు చెరిగారు. మహిళలపై దారుణంగా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
పేదలు, సామాన్యులు, బహుజనులు, మహిళలు అంటే లెక్క లేకుండా పోయిందన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. వెంటనే మహిళలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బండ్రు శోభారాణి డిమాండ్ చేశారు.
కేటీఆర్ తన పద్దతి మార్చు కోవాలని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోసారి గనుక కేటీఆర్ నోరు పారేసుకుంటే మహిళల చేతుల్లో చీపురు దెబ్బలు తినాల్సి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మహిళలంటే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసే వారి లాగా కనిపిస్తున్నారా అంటూ మండిపడ్డారు బండ్రు శోభరాణి. పబ్బులు, క్లబ్ ల సంస్కృతి కేటీఆర్ కు ఉందని, మహిళలకు కూడా ఆపాదిస్తే ఎలా అని ప్రశ్నించారు.