ENTERTAINMENT

జాతీయ ఉత్త‌మ న‌టుడిగా రిష‌బ్ శెట్టి

Share it with your family & friends

ప్ర‌క‌టించిన కేంద్ర సెన్సార్ బోర్డు

న్యూఢిల్లీ – క‌న్న‌డ స్టార్ హీరో రిష‌బ్ శెట్టి ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యాడు. శుక్ర‌వారం కేంద్ర సెన్సార్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జాతీయ స్థాయిలో సినిమా రంగం ప‌రంగా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన వారికి అవార్డుల‌ను వెల్లడించింది.

తాజాగా ప్ర‌క‌టించిన జాబితాలో అత్యుత్తమ ఉత్త‌మ న‌టుడిగా రిష‌బ్ శెట్టిని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం 70వ జాతీయ అవార్డులు వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 1 నుండి డిసెంబ‌ర్ 2022 వ‌ర‌కు సెన్సార్ బోర్డు అనుమ‌తించిన చిత్రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా రిష‌బ్ శెట్టి కాంతారా సినిమాలో అత్యుత్త‌మ‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించారు. కోట్లాది మంది ఆయ‌న న‌ట‌న‌కు ఫిదా అయ్యారు.

ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతతో సహా విజేతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 2024న షెడ్యూల్ చేయబడిన వేడుకలో సత్కరిస్తారు.

గతేడాది జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్, అలియా భట్, కృతి సనన్, పంకజ్ త్రిపాఠి టాప్ విన్నర్స్‌లో ఉన్నారు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ ఆరు అవార్డులను గెలుచుకుంది.