దక్షిణాదికి పురస్కారాల పండుగ
జాతీయ ఉత్తమ అవార్డులు రిలీజ్
ఢిల్లీ – కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం జాతీయ అవార్డులను సినిమా రంగానికి సంబంధించి ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా కర్ణాటకకు చెందిన రిషబ్ శెట్టికి దక్కగా కేరళకు చెందిన ప్రముఖ నటి నిత్యా మీనన్ కు ఉత్తమ నటిగా ఎంపికైంది.
ఉత్తమ దర్శకుడిగా ఉంచాయ్ సినిమాకు గాను సూరజ్ కు దక్కగా, ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ , సతీశ్ కృష్ణన్ ను ఎంపిక చేసింది. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ కింద పవన్ రాజ్ మల్హోత్రా , ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్ గా నీనా గుప్తా ఉంచాయ్ సినిమాకు గాను ఎంపికైంది.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీపత్ , ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆర్జిత్ సింగ్ బ్రహ్మాస్త మూవీలోని కేసరియా సాంగ్ కు గాను, ఉత్తమ నేపథ్య గాయనిగా బాంబే జయశ్రీ ఎంపికయ్యారు. అత్యుత్తమ ఛాయాగ్రహకుడిగా పొన్నియన్ సెల్వన్ -1 సినిమాకు గాను రవి వర్మకు దక్కింది.
ఇదిలా ఉండగా ఈసారి ప్రకటించిన జాతీయ ఉత్తమ అవార్డులలో దక్షిణాది సినిమా సత్తా చాటింది. ఆటం, పొన్నియన్ సెల్వన్ చిత్రాలకు అవార్డులు లభించాయి. తమిళ చిత్రం ‘తిరుచిత్రంబళం’కు నిత్యామీనన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకోగా, కన్నడ చిత్రం ‘కాంతారా’కు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’కు మానసి పరేఖ్ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు.