కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
నిప్పులు చెరిగిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ – కేటీఆర్ మీడియా సమావేశంలో మహిళలకు క్షమాపణలు చెప్పడం సరికాదని బహిరంగంగా బేషరతుగా సారీ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ.
ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కు ఆయన కుటుంబానికి ముందు నుంచీ మనుషులంటే చులకన భావం ఉందన్నారు. వారికి తోటి వారిని గౌరవించాలన్న ఇంకిత జ్ఞానం లేదన్నారు. ఇక్కడి సంస్కృతి, నాగరికత గురించి అభిమానం ఉన్నట్లయితే ఇలాంటి కామెంట్స్ చేయరన్నారు కొండా సురేఖ.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మాజీ మంత్రిగా బాధ్యత కలిగిన కేటీఆర్ ఇలా చవకబారు, తన స్థాయికి దిగజారి మహిళలను చులకన చేసి మాట్లాడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.
తన తోటి మహిళలను గౌరవించ లేని వ్యక్తి ఎలా నాయకుడిగా ఉంటాడని ప్రశ్నించారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎవరు క్షమించినా మహిళలు మాత్రం కేటీఆర్ ను క్షమించరని హెచ్చరించారు.
ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెబితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు కొండా సురేఖ.