పేదలకు భరోసా అన్న క్యాంటీన్లు ఆసరా
అన్ని దానాల కంటే అన్న దానం గొప్పది
అమరావతి – రాష్ట్రంలోని పేదలు ఎవరూ ఆకలితో ఉండ కూడదనే ఉద్దేశంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునరుద్దరించిందని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇవాళ ఈ క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజూ లక్షలాది మంది పేదలు, అన్నార్థులు, సామాన్యులకు మేలు చేకూరుతోందని చెప్పారు. ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన తొలి అయిదు సంతకాలలో అన్నక్యాంటీన్లను ఒకటిగా చేర్చారని చెప్పారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదని అన్నారు .
అన్న క్యాంటీన్ల ద్వారా చంద్రబాబు నాయుడు రాష్టంలో నిత్యాన్నదాన పధకానికి శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖజానా ఖాళీ చేసేసినా పేదలకు సంబంధించిన సంక్షేమ పధకాలకు ఎటువంటి ఆటంకం కాకుండా అమలు చేయడం ఆయనకే చెల్లిందని ప్రశంసించారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రజా అవసరాలు గుర్తించి పరిపాలన చేసే చంద్రబాబుకు, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపాలన్న మహోన్నత లక్ష్యంతో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లను అసహాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా నెల్లూరు నగర పరిధిలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.