పాదయాత్రకు శ్రీకారం కేంద్రంపై పోరాటం
ప్రకటించిన మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు.
ఎలాంటి ఆధారాలు లేక పోయినా కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ తనతో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్, జైన్ ను అకారణంగా జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తులను ఇబ్బంది పెట్టడం, కేసులు నమోదు చేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం గత 10 ఏళ్లుగా ఈ దేశంలో కొనసాగుతూ వస్తోందని ఆరోపించారు మనీష్ సిసోడియా. రోజు రోజుకు నిర్బంధం పెరుగుతూనే ఉందని, దానిని అడ్డుకోక పోతే సామాన్యులు బతికే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
కుల, మతాలు, వర్గాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కేంద్రం ఆధిపత్యాన్ని ప్రశ్నించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాచరిక పాలన సాగిస్తున్న మోడీకి బుద్ది చెప్పాలన్నారు .