ENTERTAINMENT

ఊహించ‌ని రెస్పాన్స్ క‌లెక్ష‌న్స్ అదుర్స్

Share it with your family & friends

తంగ‌లాన్ నిర్మాత జ్ఞాన వేల్ రాజా వెల్ల‌డి

త‌మిళ‌నాడు – సామాజిక నేప‌థ్యం క‌లిగిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్, పార్వ‌తి, మాళ‌విక మోహ‌న్ న‌టించిన తంగ‌లాన్ విడుద‌లైన అన్ని చోట్లా అద్భుత‌మైన ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. 1850లో జ‌రిగిన నిజ‌మైన క‌థ‌ను ఆధారంగా తీసుకుని తెర‌పై క‌నీవిని ఎరుగ‌ని రీతిలో, ఆస్కార్ ను త‌ల‌ద‌న్నేలా సినిమా తీశాడ‌న్న పేరు తెచ్చుకున్నాడు పా రంజిత్.

ఇక దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన ఆగ‌స్టు 15న దేశ వ్యాప్తంగా తంగ‌లాన్ చిత్రాన్ని విడుద‌ల చేశారు. సినిమా ఆరంభం నుంచి పూర్త‌య్యేంత దాకా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసేలా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. దీంతో భారీ ఎత్తున స‌క్సెస్ టాక్ రావ‌డంతో మూవీ టీం సంతోషంలో మునిగి పోయింది.

ఇది ప‌క్క‌న పెడితే తంగ‌లాన్ చిత్రాన్ని నిర్మించ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడు కేఈ జ్ఞాన వేల్ రాజా. శ‌నివారం సినిమా స‌క్సెస్ పై స్పందించాడు. తాము ఊహించ‌ని దానికంటే ఎక్కువ‌గా వ‌సూళ్లు వ‌స్తున్నాయ‌ని వెల్ల‌డించారు.

ఈనెల 30న అన్ని భాష‌ల‌లో తంగ‌లాన్ ను విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపాడు. కాగా ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం విశేషం. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున వ‌సూళ్లు చేయ‌నుంద‌ని సినీ వర్గాల టాక్.