నా పదవికి ఢోకా లేదు – సిద్దరామయ్య
గవర్నర్ గెహ్లాట్ విచారణకు ఆదేశం
కర్ణాటక – ముడా కుంభకోణం కేసుకు సంబంధించి సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు ఆదేశించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు ఇప్పటికే సీఎం. అయితే ఆర్టీఐ కార్యకర్తతో పాటు సామాజిక కార్యకర్త నేరుగా గవర్నర్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేశారు.
ముడా అక్రమాలకు సంబంధించి సీఎంతో పాటు ఆయన కుటుంబంపై విచారణకు ఆదేశించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించారు గవర్నర్ గెహ్లాట్. ఈ మేరకు విచారణకు అనుమతి ఇస్తున్నట్లు ఇవాళ తెలిపారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం సిద్దరామయ్య. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాను , తన ఫ్యామిలీ సిద్దంగా ఉందని చెప్పారు.
అయితే బీజేపీ, జేడీఎస్ కలిసి చేస్తున్న కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందన్నారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలు, హై కమాండ్, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్ సభ ఎంపీలంతా తన వైపు ఉన్నారని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య.