ప్రభాస్..హను రాఘవపూడి కొత్త మూవీ
ముహూర్తం ప్రారంభించిన మైత్రీ మూవీస్
హైదరాబాద్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 మూవీ సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ ఏ సినిమా చేస్తాడని నిరీక్షించిన అభిమానులకు గుడ్ న్యూస్ . క్రియేటివిటీ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన హను రాఘవ పూడికి అద్బుతమైన అవకాశం లభించింది డార్లింగ్ తో.
తాత్కాలికంగా ఫౌజి పేరుతో ప్రభాస్ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శనివారం హైదరాబాద్ లో అధికారికంగా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రభాస్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సినిమా గురించి ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రిచ్ సినిమాలకు పెట్టింది పేరు మైత్రీ మూవీస్. ఇక ప్రభాస్, మైత్రీ మూవీస్ కలిస్తే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.
ఇక ఎక్కువగా సింప్లిసిటీని కొరుకునే ప్రభాస్ ఈ చిత్రం గురించి ఒక్క మాట మాట్లాడక పోవడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా ఇంకా సినిమా ప్రారంభం కాక ముందే ఓ రేంజ్ ను దాటేశాయి ఫ్యాన్స్ అంచనాలు.
మరో పాన్ ఇండియా సినిమా హిట్ కొట్టడం ఖాయమంటున్నారు డార్లింగ్ అభిమానులు.