NEWSTELANGANA

కాంగ్రెస్ నిర్వాకం కేటీఆర్ ఆగ్ర‌హం

Share it with your family & friends

క‌మ‌ల్ హాస‌న్ రెడ్డికి వంత పాడిన నేత

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీనియ‌ర్, సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురి చేస్తోంద‌ని ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి స్వంత ఛాన‌ల్ ద్వారా ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న స‌ద‌రు ఛాన‌ల్ గురించి బ‌య‌ట చెప్పేందుకు ఇష్ట ప‌డ‌లేదు. అయితే సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ క‌మ‌ల్ హాస‌న్ రెడ్డిని రిపోర్టర్ ప్ర‌శ్నించిన తీరుకు సంబంధించిన వీడియో ను షేర్ చేశారు.

ఎంత సీఎం ఛాన‌ల్ అయినా దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయ‌ని, వాటిని అతిక్ర‌మిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు కేటీఆర్. నిజాయితీ గల ఆఫీసర్ గా పేరున్న కమలాసన్ రెడ్డి ని కావాలనే ఇబ్బంది పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు.

ఇలాంటి చర్యలు నిజంగా దిగ్ర్భాంతికరమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకింత పనికిమాలిన పనులు చేస్తుందని నిల‌దీశారు. ఇలాంటి చర్యలు అధికారుల మనో నిబ్బరాన్ని దెబ్బ తీస్తాయని వాపోయారు. ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.