NEWSANDHRA PRADESH

ఉద్యోగుల బదిలీలకు సర్కార్ లైన్ క్లియ‌ర్

Share it with your family & friends

మొత్తం 15 శాఖల్లో బదిలీలకు అనుమతి

అమ‌రావ‌తి – ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఉద్యోగుల బ‌దిలీకి ప‌చ్చ జెండా ఊపింది. ఈ మేర‌కు ప్ర‌స్తుతానికి 15 శాఖ‌ల్లో ఉద్యోగుల బ‌దిలీకి ఓకే చెప్పింది.

ఆగస్ట్ 19 నుంచి 31 వరకు బదిలీల పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఇక ఉద్యోగుల బ‌దిలీలకు సంబంధించి రాష్ట్రంలోని పురపాలక, రెవిన్యూ, పంచాయితీ రాజ్, గనులు, పౌర సరఫరాలు, ఇంజనీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవేదాయ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల, విద్యుత్, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖల్లోబ‌దిలీల‌కు అనుమ‌తి ఇచ్చింది.

ఎక్సైజ్ శాఖలో సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతి ఇస్తున్న‌ట్లు పేర్కొంది స‌ర్కార్. కాగా ఉపాధ్యాయ , వైద్య ఆరోగ్య సిబ్బంది బదిలీలకు దూరం పెట్టింది. అయితే ఈ బ‌దిలీల‌ను పాత 13 జిల్లాల ప్రాతిప‌దిక‌న చేప‌ట్ట‌నుంది.

ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీకి సంబంధించి ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకు మినహాయింపు ఇస్తూ ఉత్త‌ర్వు జారీ చేసింది స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీల్లో అవకాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.