తులసీ గబ్బార్డ్ కు డొనాల్డ్ ట్రంప్ ఛాన్స్
మరో భారతీయ అమెరికన్ కు అవకాశం
అమెరికా – ఎలాగైనా సరే ఈసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ప్రధానంగా ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో పోటీ పడుతున్నారు. అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ అనారోగ్యం, వయసు రీత్యా కారణంగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో కమలా హారిస్ ను నిలబెడుతున్నట్లు , మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది అమెరికా అధ్యక్షక్ష ఎన్నికల ప్రక్రియ.
డొనాల్డ్ ట్రంప్ మాటల తూటాలు పేల్చుతున్నారు. మరోసారి గనుక ఛాన్స్ ఇస్తే అమెరికా వందేళ్లు వెనక్కి పోతుందని, అమెరికా ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, వలస వాదుల ఆధిపత్యం పెరిగి పోయిందని ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కమలా హారిస్ . ట్రంప్ గనుక ప్రెసిడెంట్ గా ఎన్నికైతే అమెరికాలో ఉగ్రవాదం మరింత పెరుగుతుందని, నిత్యం దాడులు, హత్యలు, కాల్పులు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరించారు.
దీంతో ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి కమలా హారిస్ కావడంతో ఆమెను ఎదుర్కొనేందుకు గాను మరో ఇండియన్ అమెరికన్ అయిన తులసీ గబ్బార్డ్ కు అవకాశం ఇచ్చారు. గత కొంత కాలం నుంచి ఆమెకు ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.