పాపన్న గౌడ్ స్పూర్తి అజరామరం
రాజకీయ యుద్ద వేదిక నిర్మించాలి
హైదరాబాద్ – బహుజనుల ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆగస్టు 17న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు ఆయన ఆశయాల సాధన కోసం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
ముందుగా పాపన్న గౌడ్ ఆశయాలు సాధించాలంటే..అగ్ర కుల పార్టీల బందీఖాన నుండి బయట పడాలని అన్నారు. వీరుడైన “పాపన్న గౌడ్” స్ఫూర్తితో స్వతంత్రంగా ఒక రాజకీయ యుద్ధ వేదికను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు విశారదన్ మహారాజ్.
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్టోపస్ లా అల్లుకు పోయిన వెలమ, రెడ్డి భూస్వామ్య రాజకీయ వ్యవస్థను బద్దలు కొట్టి, భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు డీఎస్పీ చీఫ్.
ఈ పనిని ముందుగా గౌడ సమాజం నుండే మొదలు కావాలని పేర్కొన్నారు. ఈ పని చేయకుండా అగ్రకుల పార్టీ లలో పని చేస్తూ.. పాపన్న గౌడ్ ఆశయాలను సాధిస్తాం.. అంటే అది శుద్ధ అబద్ధం అని స్పష్టం చేశారు . ఇది ఒక పెద్ద జోక్ గా ఆయన అభివర్ణించారు.