సింహాద్రి అప్పన్న సన్నిధిలో హోమ్ మంత్రి
స్వామిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
విశాఖపట్నం – రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం కుటుం సమేతంగా ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం అప్పన్న లక్ష్మి నరసింహ స్వమిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ కమిటీ చైర్మన్ , సభ్యులతో పాటు పూజారులు సాదర స్వాగతం పలికారు.
సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆమెకు చిత్ర పటంతో పాటు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.
ఇల వేల్పును దర్శించుకున్న అనంతరం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అప్నన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అని అన్నారు.
మెట్ల మార్గం ద్వారా స్వామి వారిని దర్శించు కోవడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సింహా చలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హోం శాఖ మంత్రి.
ప్రస్తుతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. ఈ సందర్బంగా ఆ దేవ దేవుడిని అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండేలా చూడాలని ప్రార్థించానని తెలిపారు .