గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థుల గోడు వినండి
వారిని 1:100 లెక్కన ఇంటర్వ్యూకు పిలవాలి
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. గ్రూప్ -1 ఎగ్జామ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల తరపున వారి గోడు వినిపిస్తున్నానని తెలిపారు.
గ్రూప్ -2, డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1:100 పద్దతిన విధానాన్ని అమలు చేసిందని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. అదే రీతిన ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం, కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్ 1 సిలబస్‌ను రివిజన్ చేయలేక పోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో తీవ్రంగా నష్ట పోయారని, అభ్యర్థులు వాపోతున్నారని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్. అభ్యర్థుల ఆవేదనను సీఎం చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .