రుణ మాఫీ కాలేదంటున్న కాంగ్రెసోళ్లు
ఎద్దేవా చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – తనను ఏ ఆధారాలతో రాజీనామా చేయాలని సవాల్ చేశావో చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మీ పార్టీ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదని అంటున్నారని, ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో, ఎవరు ఏటిలో దూకి చావాలో, ఎవరికి చీము నెత్తురు లేదో, ఎవరు అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు భూమికి రాయాలో, ఎవరు రాజీనామా చెయ్యాలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు.
కోదండ రెడ్డి , కోదండరాం రెడ్డి , ఆది శ్రీనివాస్ .. ముగ్గురూ రుణ మాఫీ పూర్తిగా కాలేదని చెబుతున్నారని మరి నువ్వు చెప్పింది నిజమా వీరు చెప్పింది అబద్దమో తేల్చాల్సింది నేను కాదు నువ్వేనంటూ మండిపడ్డారు మాజీ మంత్రి.
రూ. 31 వేల కోట్లు అని చెప్పి చివరకు రూ. 17 వేల కోట్లుగా తేల్చింది మీరేనని, తాము కాదన్నారు. అబద్దాలు పదే పదే చెప్పినంత మాత్రాన అవి నిజాలై పోతాయా అని ప్రశ్నించారు హరీశ్ రావు. ఒకవేళ పూర్తిగా రుణాలు మాఫీ అయి ఉంటే రైతులు రోడ్లపైకి వచ్చి శవ యాత్ర చేస్తారంటూ ప్రశ్నించారు.