తల్లీ కరుణించు తెలంగాణను రక్షించు
అమ్మ వారిని దర్శించుకున్న బండి సంజయ్
కరీంనగర్ జిల్లా – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం జిల్లాలోని సిరిసిల్ల పట్టణాన్ని సందర్శించారు. ఇక్కడ ప్రసిద్ది చెందిన ఆలయం ఉంది. ఈ సందర్బంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి.
అక్కడ జరుగుతున్న శ్రీ లక్ష్మీ గణపతి మార్కండేయ రుద్ర యాగ పరస్పర నవ కుండాత్మక సహిత త్రయాహ్నిక శ్రీ చండీ మహా యాగము అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు నిర్వాహకులు.
ఆదివారం పూర్ణాహుతి సందర్భంగా అమ్మ వారిని దర్శించుకున్నారు బండి సంజయ్ కుమార్. ఈ సందర్బంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.
పూజారులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మ వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అపర భక్తుడైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ అమ్మ వారిని కొలిచారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని, తెలంగాణ సకల సంపదలతో తల తూగాలని ప్రార్థించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి.