డాక్టర్ కేసును త్వరగా విచారించాలి
డిమాండ్ చేసిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
ఢిల్లీ – ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న డాక్టర్ అత్యాచార ఘటనపై స్పందించారు. ఎంపీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరగడం బాధాకరం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. అయితే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించిందని , విచారణకు ఆదేశించిందని చెప్పారు సంజయ్ ఆజాద్ సింగ్.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన కేసు సీబీఐ ఆధీనంలో ఉందన్నారు. దీని గురించి ఎక్కువ మాట్లాడటం తన పరిధిలోకి రాదన్నారు. అయినా ఘటనపై స్పందించే హక్కు తనకు ఉంటుందన్నారు ఎంపీ .
ఘటన జరిగిన వెంటనే కోల్ కతా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు సంజయ్ ఆజాద్ సింగ్.
ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకున్నా అది చాలా కఠినంగా ఉండాలని, ఇతరులు ఇలాంటి వాటికి పాల్పడాలంటే భయంతో వణికి పోవాలని అన్నారు ఎంపీ. దీంతో పాటు వీలైనంత త్వరగా సీబీఐ విచారణ జరిపి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తరలించాలని డిమాండ్ చేశారు .