NEWSTELANGANA

ఐడియా ఇవ్వండి ల‌క్ష పొందండి

Share it with your family & friends

స్మితా స‌బ‌ర్వాల్ బంప‌ర్ ఆఫ‌ర్ జ‌నాల‌కు

హైద‌రాబాద్ – రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న స్మితా స‌బర్వాల్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌న‌కు న‌చ్చిన అంశాల‌పై స్పందించ‌డం, సామాజిక మాధ్య‌మాల‌లో త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా తెలియ చేస్తూ నిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. దీంతో ఖ‌జానాలో డ‌బ్బులు లేకుండా పోయాయి. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా స‌ర్కార్ ను న‌డ‌ప‌డం ఇబ్బందిగా మారింది. ఓ వైపు అప్పులు త‌డిసి మోపెడ‌వుతున్నాయి.

దీంతో ఆర్థిక శాఖ‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే కీల‌క‌మైన శాఖ కావ‌డంతో వినూత్న ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళుతున్నారు స్మితా స‌బ‌ర్వాల్. సీనియ‌ర్ ఆఫీస‌ర్ గా ఆమెకు అపార‌మైన అనుభ‌వం ఉంది. ఔత్సాహికులైన వారిని ప్రోత్స‌హిస్తున్నారు.

తాజాగా ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు స్మితా స‌బ‌ర్వాల్. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వడంతో పాటు మంచి ఐడియా ఇవ్వాల‌ని కోరింది. ఇందుకు సంబంధించి డ‌బ్బులు వ‌చ్చేందుకు, ప్రాఫిట్ వ‌చ్చేలా గుడ్ ఆలోచ‌న ఇస్తే ప్ర‌భుత్వ ప‌రంగా రూ. ల‌క్ష బ‌హుమానంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు స్మితా స‌బ‌ర్వాల్.

ఈ ఐడియా పెంచేందుకు వ‌చ్చే సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు. పూర్తి వివ‌రాల కోసం tgsfc2024@gmail.com ను సంప్రదించాలని స్మితా స‌బ‌ర్వాల్ కోరారు.