దీదీ ఇచ్చే డబ్బులు మాకు అక్కర్లేదు
బాధితురాలి తండ్రి షాకింగ్ కామెంట్స్
కోల్ కతా – ఓ వైపు దేశ వ్యాప్తంగా కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో వైపు ఆమె పేరెంట్స్ మాత్రం సీరియస్ గా స్పందించారు. ప్రధానంగా బాధితురాలి తండ్రి కోపం వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేశారు.
ముందు నిందితులకు శిక్ష పడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భయపడేలా ఉండాలని అన్నారు. లేక పోతే ముక్కు పచ్చలారని అమాయకులైన అమ్మాయిలు, మహిళల బతుకులు నాశనమై పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారాన్ని స్వీకరించడానికి ఆయన నిరాకరించాడు. ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ప్రజల కోపాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు బాధితురాలి తండ్రి.
“నేరస్థులకు కఠిన శిక్ష విధించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక నష్టపరిహారం అంశాన్ని పరిశీలిస్తానుష అని స్పష్టం చేశారు.