NEWSTELANGANA

అభిషేక్ మ‌ను సింఘ్వీ సేవ‌లు అవ‌స‌రం

Share it with your family & friends

ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడు కావ‌డం సంతోషం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింగ్విని ఏఐసీసీ ఎంపిక చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ అవ‌కాశం త‌మ‌కు ద‌క్క‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఎ. రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, విభజన సమస్యల పరిష్కారంలో, ఇటు రాజ్యసభ లోను, అటు న్యాయ స్థానాలలోను అభిషేక్ మ‌ను సింగ్వీ తన సేవలు అందిస్తారన్న విశ్వాసం త‌న‌కు ఉంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి.

అభిషేక్ మ‌ను సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన కాంగ్రెస్ అధిష్టానానికి, పార్టీ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి. మొత్తంగా సింఘ్వీకి రాజ‌కీయ ప‌రంగానే కాదు న్యాయ ప‌రంగా అపార‌మైన అనుభ‌వం ఉంది. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న‌ను క‌ర్ణాట‌క నుంచి పంపించాల‌ని అనుకుంది. కానీ ఎక్కువ శాతం స‌భ్యులు ఇక్క‌డి నుంచి ఎన్నిక కావ‌డంతో తెలంగాణ నుంచి ప్రిఫర్ చేసింది.