అన్న క్యాంటీన్ల కోసం రూ. కోటి విరాళం
నారా లోకేష్ కు మాజీ ఎంపీ చెక్కు అందజేత
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్దరించిన అన్న క్యాంటీన్లకు పెద్ద ఎత్తున అన్నార్థులు, పేదలు, సామాన్యులు తరలి వస్తున్నారు. తమ ఆకలి తీర్చుకుంటున్నారు. భారీ ఎత్తున అన్న దానం కోసం ఖర్చు అవుతోంది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి దాతలు ముందుకు రావాలని, పేదల ఆకలిని తీర్చేందుకు తమ వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు పలువురు దాతలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.
ఇందులో భాగంగా మాజీ ఎంపీ డాక్టర్ గోకరాజు గంగ రాజు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం తన వంతుగా రూ. 1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కు చెక్కును అందజేశారు.
ఈ సందర్బంగా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజును, ఆయన కుటుంబాన్ని విరాళం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరికొందరు స్పందించాలని, విరాళాలు ఇవ్వాలని కోరారు .