గెలిచినా..ఓడినా ప్రజలతోనే ఉంటా
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
అమరావతి – మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటానని స్పష్టంచేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం బిరదవోలు పల్లెలో పర్యటించారు. ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని స్పష్టం చేశారు.
అధికారం ఉన్నా, లేక పోయినా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హమీ ఇచ్చారు.
అవినీతి, అన్యాయాలపై గళం విప్పడంతో పాటు, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు సహకరిస్తానని అన్నారు మాజీ మంత్రి.
అవినీతికి మారుపేరుగా మారుతున్న సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి జరగకుండా చూడడంతో పాటు, ప్రజలకు అన్యాయం కలగకుండా చూడటం నా బాధ్యత అని అన్నారు.
ముత్యాల పేటలో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు కండె రమణయ్య కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.