NEWSANDHRA PRADESH

23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స‌భ‌లు చేప‌ట్టాలి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీలక ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం స‌చివాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. పంచాయ‌తీరాజ్ శాఖపై స‌మీక్ష చేప‌ట్టారు . ఇదిలా ఉండ‌గా ఉపాధి హామీ ప‌థ‌కంలో చేప‌ట్టాల్సిన ప‌నుల ఆమోదం కోసం గ్రామ స‌భ నిర్వ‌హ‌ణ , ఇందుకు సంబంధించిన విధి విధానాల‌పై దిశా నిర్దేశం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని స్ప‌ష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టాల‌ని సూచించారు డిప్యూటీ సీఎం.

ఈ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి రూపాయినీ బాధ్యతతో ఖ‌ర్చు చేప‌ట్టాల‌న్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్ , ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.