NEWSNATIONAL

క్యాబ్ డ్రైవ‌ర్లు..డెలివ‌రీ ఏజెంట్లను ఆదుకోవాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్

ఢిల్లీ – లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా క్యాబ్ డ్రైవ‌ర్లు, డెలివ‌రీ ఏజెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. సోమ‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

త‌క్కువ ఆదాయం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంద‌ని పేర్కొన్నారు. దేశంలో కొలువు తీరిన మోడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి , సామాన్యుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని వాపోయారు రాహుల్ గాంధీ.

ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని చెప్పారు. దేశంలో క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల వంటి గిగ్ వర్కర్ల సమస్యలను పరిశీలించడానికి అతని కుటుంబాన్ని కలిశారు రాయ్ బ‌రేలీ ఎంపీ. పొదుపు చేసే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని, దీనిపై తాము తీవ్ర ఆవేద‌న చెందుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ సమస్యలను పరిష్కరించడానికి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైన విధానాలను రూపొందించడం ద్వారా న్యాయం చేస్తాయ‌ని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.

భారతదేశ జన బంధన్ పూర్తి పోరాటంతో దేశ వ్యాప్త విస్తరణకు హామీ ఇస్తుంద‌న్నారు .