తెలంగాణ సీఎం స్కామ్ లకు కేరాఫ్
మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముడా కుంభకోణంలో కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గెహ్లాట్ సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన కుటుంబాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఒక్క కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదు తెలంగాణలో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఎ. రేవంత్ రెడ్డి అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఎక్కడి నుంచి కోట్లు వస్తున్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు . ఇవాళ రాఖీ పండుగ. ప్రతి ఏటా తనకు సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టేదని గుర్తు చేసుకున్నారు. కానీ తను లేక పోవడం దారుణమన్నారు.
తనను కావాలనే తన తండ్రి కేసీఆర్ పై అక్కసుతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏదో ఒక రోజు న్యాయం గెలుస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఇప్పటి వరకు 155 రోజులు అయ్యిందని చెప్పారు. త్వరలో బెయిల్ వస్తుందని , అదే ఆశతో ఉన్నామని చెప్పారు కేటీఆర్.