NEWSTELANGANA

ఆరోప‌ణ‌లు నిజ‌మైతే కొట్టి చంపండి – మూర్తి

Share it with your family & friends

వేణు స్వామి ఆరోప‌ణ‌లు ప‌చ్చి అబ‌ద్దం

హైద‌రాబాద్ – ఆస్ట్రాల‌జిస్ట్ వేణు స్వామి జ‌ర్న‌లిస్ట్ మూర్తి మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. త‌న‌ను మూర్తి బ్లాక్ మెయిల్ చేశాడ‌ని, త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయ‌కుండా ఉండాలంటే, ప్ర‌సారం చేయ‌కుండా ఉండాలంటే క‌నీసం రూ. 5 కోట్ల రూపాయ‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడంటూ వేణు స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా వేణు స్వామి చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌పై తీవ్రంగా స్పందించారు ఛాన‌ల్ రిపోర్ట‌ర్ మూర్తి. తాను గ‌నుక వేణు స్వామిని రూ. 5 కోట్లు అడ‌గ‌డం అనేది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఒక‌వేళ తాను అడిగిన‌ట్లు నిరూపిస్తే త‌న‌ను కొట్టి చంపాల‌ని పిలుపునిచ్చారు. ఇందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం మూర్తి సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఒక‌వేళ వేణు స్వామి వ‌ద్ద సాక్ష్యాలు లేక పోతే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్దంటూ చెప్పాల‌ని కోరారు. తాను గ‌త 30 ఏళ్లుగా జ‌ర్న‌లిజం కెరీర్ లో ఏ ఒక్క‌రినీ ఒక్క పైసా అడిగిన పాపాన పోలేద‌న్నారు. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో ఆనాటి గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారీ స్టోరీని బ‌య‌ట పెట్టింది తానేన‌ని స్ప‌ష్టం చేశారు మూర్తి.