NEWSTELANGANA

రాజీవ్ విగ్ర‌హాన్ని ముట్టుకుంటే ఖ‌బ‌డ్దార్

Share it with your family & friends

బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌పై , పార్టీపై ప‌దే ప‌దే నోరు పారేసుకుంటున్న భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన నేత‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎ. రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏకి పారేశారు. ఆయ‌న త‌న తండ్రి కేసీఆర్ విగ్ర‌హాన్ని ఉంచాల‌ని కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న తండ్రి ఎప్పుడు వెళ‌తారో ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు సీఎం.

పాఠ‌శాల విద్యార్థుల ముందు రెచ్చి పోయారు ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని సచివాలయంలో ఉంచుతామ‌ని చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని పెట్ట‌డాన్ని వ్య‌తిరేకించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎ. రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ అహంకారంతో మాట్లాడుతోంద‌ని ఆరోపించారు. గ‌త 10 సంవ‌త్స‌రాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పాల‌న సాగించింద‌ని, మ‌రి ఎందుకు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. ఒక‌వేళ ఎవ‌రైనా, ఏ స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ నాయ‌కుడైనా రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని ముట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తే చెప్పుల‌తో కొడ‌తామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం.