సీబీఐ ఏం చేస్తోంది – టీఎంసీ ఎంపీ
సాగరికా ఘోష్ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై నిప్పులు చెరిగింది టీఎంసీ. ఆ పార్టీకి చెందిన ఎంపీ సాగరికా ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. సీబీఐ ఏం చేస్తోందంటూ నిలదీశారు.
కోల్ కతా డాక్టర్ రేప్, హత్య చేసిన ఘటనపై స్పందించిన ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో సీబీఐ ఏం చేస్తోందంటూ నిలదీశారు. ఎందుకు మౌనంగా ఉందని ఫైర్ అయ్యారు.
సామాజిక మాధ్యాలలో ఈ విషయం గురించి తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫేక్ ప్రచారాన్ని ఎందుకు అడ్డు కోవడం లేదంటూ సాగరికా ఘోష్ ప్రశ్నించారు.
సిబిఐ ఈ కేసును సమాధి చేయడానికి ప్రయత్నిస్తోందా? రాజకీయ ప్రయోజనాన్ని బిజెపికి అప్పగించడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కలుగుతోందన్నారు ఎంపీ. దీనిపై కేంద్రం సమాధానం చేయాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని అన్నారు. కానీ కావాలని కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ బద్నాం చేయాలని చూస్తోందని ఆరోపించారు సాగరికా ఘోష్.