శభాష్ తిరువణ్ణామలై కలెక్టర్ – స్పీకర్
అభినందనలతో ముంచెత్తిన అయ్యన్న
తమిళనాడు – దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది తమిళనాడులోని తిరువణ్ణామలై. ప్రతి రోజూ వేలాది మంది స్వామి వారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా మంగళవారం ఆంధప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభా పతి (స్పీకర్) చింతకాయల అయ్యన్న పాత్రుడు అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కలుసుకున్నారు తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ డి. భాస్కర పాండియన్. ఈ ప్రాంతమంతా పర్యావరణం, పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు మంచి పాలన అందించడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్బంగా ప్రశంసలు కురిపించారు జిల్లా కలెక్టర్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.
సుపరిపాలన కోసం ఇలాంటి కలెక్టర్లు ఈ దేశానికి కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను స్వామి వారిని దర్శించుకున్నానని, ఎనలేని ఆనందానికి లోనయ్యానని చెప్పారు స్పీకర్. శైవ క్షేత్రాలలో అద్భుతమైన క్షేత్రమని పేర్కొన్నారు. ఆనాడు శ్రీకృష్ణ దేవరాయులు కట్టించిన ఈ అద్భుత ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు.