29న డాక్లర్ పోస్టులకు ఇంటర్వ్యూ – టీటీడీ
ప్రకటించిన ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 29న కాంట్రాక్టు పద్దతిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. తమ దరఖాస్తులు, సంబంధిత అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు, అనుభవానికి సంబంధించిన ఏవైనా పత్రాలు ఉంటే నేరుగా ఆగస్టు 29న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01 ) కింద గ సేవలు అందించేందుకు ఎంబిబిఎస్ విద్యార్హత గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు ఈవో.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ లో ఉదయం 11 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగనుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువ పత్రాల ఒరిజినల్ , జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
ఇతర వివరాలకు www.tirumala.org వెబ్సైట్ను, లేదా కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించాలని కోరారు.