దీదీ సర్కార్ కు టికాయత్ మద్దతు
కూల్చేందుకు కేంద్రం కుట్ర
ఉత్తర ప్రదేశ్ – రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కోల్ కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా బాధ్యతా రాహిత్యం తప్ప మరోటి కాదని పేర్కొంది.
ఈ తరుణంలో రాకేశ్ టికాయత్ ఘటనపై స్పందించారు. బాధాకరమేనని, తాను కూడా బాధ పడుతున్నానని అన్నారు. బుధవారం రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ యేతర రాష్ట్రాలను బలహీన పర్చేందుకు పీఎం మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఎందుకని కావాలని కోల్ కతా కేసును హైలెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. గత కొన్ని రోజుల నుంచి ఫేక్ ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. తాము సీఎం దీదీకి మద్దతుగా ఉంటామని ప్రకటించారు.