సీఎంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సహకరించండి
అమరావతి – ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రతినిధులతో చర్చించారు సీఎం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి విజన్, ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఈ సందర్బంగా వెల్లడించారు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులకు. ఏపీకి భవిష్యత్ అందమైన రాజధాని నగరాన్ని రూపొందించే ఈ ప్రయత్నంలో తమతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్దికి ఇతోధికంగా సహాయం చేయాలని ఆయన వరల్డ్ బ్యాంకు తో పాటు ఆసియా అభివృద్ది బ్యాంకు ప్రతినిధులను కోరారు నారా చంద్రబాబు నాయుడు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, తదితర రంగాలకు చెందిన కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
కంపెనీల రాక వల్ల వేలాది మందికి ఉపాధి కలుగుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వెంటనే మీ వద్ద ఉన్న డబ్బులను తమ రాష్ట్రానికి అందజేయాలని కోరారు సీఎం. ఇదిలా ఉండగా చంద్రబాబు చేసిన విన్నపాన్ని వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.